రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను వినాయకుడు తొలగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వినాయకుడిని ప్రార్థించారు. పరమ పవిత్రమైన వినాయక చవితి పర్వదినం సందర్భంగా మనందరం ఇళ్లలో మట్టి వినాయకుడిని పూజిద్దామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించడం పర్యావరణంకు మేలుచేయడంతో పాటు అది మన సంస్కృతి అని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రతి మండపంలోను మట్టి వినాయకులను పెట్టి పూజించి మన సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఊరూరూరా వెలసిన వినాయక మండపాలను ఈ ఏడాది ప్రజా ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందిస్తోంది. వినాయక మండప నిర్వహకులు అందరూ అధికారులు సూచించిన భద్రతా ప్రమాణాలు అన్ని పాటించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.