సీఎస్ పదవీ కాలం పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణ రావు పదవీ కాలాన్ని మరో 7 నెలలు పొడగించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈనెలాఖరున పదవీ విరమణ చేయాల్సిన సి.ఎస్ రామకృష్ణా రావు పదవిని పొడగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా రామ కృష్ణారావు పదవీ కాలాన్ని మరో 7 నెలలు పొడగించడానికి అంగీకరించింది.