రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభావిత జిల్లాల వైద్య శాఖ అధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో టెలిపోన్లో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వర్షాలు అధికంగా కురుస్తున్న మెదక్ , కామారెడ్డి , సంగారెడ్డి , సిరిసిల్లా, సిద్దిపేట లతో పాటు ఇతర జిల్లాలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అదికారులను అదేశించారు.
లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలన్నారు . స్నేక్ బైట్ లు, సీజనల్ వ్యాధులు విస్తరించకుండా అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి అదేశించారు. వచ్చే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను అదేశించారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాప్ , ఫార్మాసిస్ట్ లు, అసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అదేశించారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారిన నేఫధ్యంలో ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించటం పై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిరంతరం జిల్లాల వైధ్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను అదేశించారు. లోతట్టు ప్రాంతాలలో వర్ష ప్రభావానికి గురైన ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, అంటు వ్యాధులు ప్రభలకుండా మెరుగైన పారిశుధ్య చర్యలు తీసుకోవటానికి పురపాలక, పంచాయితీ శాఖ ల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి పేర్కోన్నారు. వైద్య , ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ అదికారులను అదేశించారు. రెవిన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయితీ, డిజాస్టర్ మెనేజ్మేంట్ అధికారులతో సమన్వయం చేసుకోని అధిక వర్షా ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అదేశించారు.