30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబరు 30 లోపు నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు 10వ తేదీ తర్వాత నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నల్లగొండ జిల్లాకు నీళ్లు రాకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. డిమాండ్‌కు అనుగుణంగా కేంద్రం నుంచి యూరియా అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.