ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర పరికరాలను వెంటనే రిపేర్ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 8 ఏండ్లు దాటిన ఎక్విప్మెంట్ను స్రాప్ చేయాలని ఆదేశించారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, హెల్త్ కమిషనర్ సంగీత సత్యానారాయణ, టీజీఎంఎస్ ఐడీసీ ఎండీ ఫణింద్ర రెడ్డి పాల్గొన్నారు.
