గ్రీన్ ఇండియా చాలేంజ్ నాదర్గుల్ గ్రామం అంగన్ వాడి –5 లో మొక్కలు నాటిన రాష్ట్ర పుడ్ కమీషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి

ఈ రోజు గౌ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమారు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా చాలేంజ్ ను స్వీకరించి నాదర్గుల్ గ్రామం రంగారెడ్డి జిల్లా లోని అంగన్ వాడి –5 లో మొక్కలు నాటడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర పుడ్ కమీషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి రంగినేని శారద , శ్రీమతి భారతి, సిడిపివో శ్రీమతి వినీతారెడ్డి, సూపర్ వైజర్ సూర్యకళా, టీచర్లు కల్పన, కవిత, మంజులు స్ధానిక కార్పోరేటర్లు తోట శ్రీధర్ రెడ్డీ మరియు నిమ్మల సునిత, రామోజీ అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ప్రతి ఒక్కరు ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటాలని పర్యావరణం పరిరక్షణకి తోడ్పాటు కావాలని భావితరాలకు మనము ఇచ్చే మంచి బహుమతి ఇదే అని తెలియజేశారు. శ్రీమతి రంగినేని శారద మాట్లాడుతూ ముగ్గురు మూడు మొక్కలు నాటాలి ఆ ముగ్గురు మరో ముగ్గురిని నామినేట్ చేసి వారు కూడా మూడు మొక్కలు నాటాలని , వాటిని కనీసం మూడు సంవత్సరాలు ఎదిగే బాధ్యత తీసుకుంటే , అవి మన జీవితానికి సరిపోయేందుకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తుంది అని తెలిపారు. ఇలా రాష్ట్రం మొత్తం మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కి చేయూతనివ్వాలని తెలియజేశారు ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన జోగినిపల్లి సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.