- తుమ్మడి హట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి ప్రణాళికలు
- సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు నీటికేటాయింపులు జరిగేలా ప్రతిపాదనలు
- పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి ప్రాధాన్యత
- ప్రాజెక్టుల భూసేకరణలో జాప్యం వలదు
- దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజ్-3-6 పనులను పర్యవేక్షించండి
- పూడిక తీత పనులను త్వరితగతిన ప్రారంభించండి
- పూడిక తీతతో రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల పై చిలుకు ఆదాయం
- హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధం
- మూడు దశాబ్దాల మీదట నీటిపారుదల శాఖలో పదోన్నతులు
- పదోన్నతులు పొందిన వారికి 14 న జలసౌధ లో అభినందన సభ
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న దరిమిలా రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. సోమవారం రోజున నీటిపారుదల శాఖా ప్రధాన కార్యాలయం జలసౌధ లో జరిగిన నీటిపారుదల శాఖా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని రాష్ట్రం లోని ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు,ఇ.ఎన్.సి లు అంజద్ హుస్సేన్ సి.యి లు మధుసూదన్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,విజయ బాస్కర్ రెడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలు పెట్టిం చేవెళ్ల-ప్రాణహితను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయల్సిన ప్రాజెక్టులలో సమ్మక్క- సారక్క ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.అందులో భాగంగా ఈ నెల 23 న ఢిల్లీ లో కేంద్ర జలవనరుల సంఘం సమావేశానికి హాజరై ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులతో పాటు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (TAC) నుండి అనుమతి తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదే విదంగా ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో చర్చించి అనుమతులు తీసుకోవాలని ఆయన సూచించారు. సీతారాం సాగర్,మోడికుంట వాగు,చనాకా/కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టంతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మణాలకు కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేసే విదంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలన్నారు. కృష్ణా జలాల వివిధ ట్రిబ్యునల్(KWDT) విషయమై సుప్రీంకోర్టులో ఈ నెల 23-25 న వాదనలు ఉన్నందున అంతకు ముందే సుప్రీంకోర్టు న్యాయవాది సి.ఎస్.వైద్యనాధ్ తో చర్చలు జరగనున్నాయన్నారు.
జాతీయ డ్యామ్ ల పరిరక్షణ సంస్థ చేసిన సూచనలకు అనుగుణంగా మెడిగడ్డ,అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ లను పునరుద్ధరణ ఉంటుందన్నారు.బ్యారేజ్ లను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతతో ఉందని అయితే NDSA సూచనాలకనుగుణంగా పనులు ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.అయితే అదే సమయంలో I IIT వంటి సంస్థలతో నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరీక్షించేలా చర్యలు తీసుకోవడంతో పాటు వరదలు తగ్గిన వెంటనే పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించు కోవలన్నారు.వచ్చే సంవత్సరం వానాకాలం లోపు పనులు పూర్తి చేయాలన్నారు. అన్నింటికీ మించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పూర్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.పెండింగ్ లో ఉన్నభూసేకరణ, పునరావాసంతో పాటు అటవిశాఖా అనుమతుల వంటి ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు.కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.అదే విదంగా డిండి,ఎస్.ఎల్.బి.సి,పెండ్లి పాకల,నక్కలగండి ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలన్నారు.
జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి అక్కడి ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి ముందే దేవాదుల ప్యాకేజ్3,6 పనుల పురోగతి పై నివేదిక సమర్పించాలని ఆయన చెప్పారు. యావత్ భారత దేశంలో తెలంగాణా ప్రభుత్వం మొట్టమొదటి సారిగా చేపట్టిన రిజర్వాయర్ లలో పూడిక తీత పనులపై పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.ఇప్పటికే మిడ్ మానేరు,కడెం రిజర్వావాయర్ లలో మొదలుపెట్టామని ప్రస్తుతం జూరాల,నాగార్జున సాగర్,ఎస్.ఆర్.ఎస్.పి నిజాం సాగర్,హుస్సేన్ సాగర్ తదితర ప్రాజెక్టులలో పూడిక తీత పనులు ప్రారంభించ బోతున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పుడు చేపట్టిన పూడిక తీత పనుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 500 కోట్ల రాబడి ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్లయిటే ప్రభుత్వానికి 3000 కోట్ల నుండి 4000 కోట్ల వరకు రాబడి వస్తుందన్నారు. అన్నింటికీ మించి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్దరణకు గాను నిర్వహించ తలబెట్టిన హెలిబోర్న్ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయాన్నారు.ఎస్.ఎల్.బి.సి టన్నెల్ సమీపంలో హెలిబోర్న్ ఏరియల్ మాగ్నెటిక్ సర్వే ఏర్పాట్లును అయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నీటిపారుదల శాఖల్లో మూడు దశాబ్దాల సుదీర్గ విరామం అనంతరం పదోన్నతుల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.పదోన్నతులు పొందిన వారికి ఈ నెల 14 న జలసౌధ లో అభినంద సభ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.