కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలి

 రసాయన, ఫార్మా పరిశ్రమల్లో ఉద్యోగులు, కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సంబంధిత అధికారులు, యాజమాన్యాలను కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘కెమికల్‌, ఫార్మా పరిశ్రమల్లో వృత్తిపరమైన భద్రత’ అంశంపై కంపెనీల ప్రతినిధులు, ఐటీఐ కాలేజీల ప్రిన్సిపాళ్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. మంత్రి వివేక్‌ ఇందులో పాల్గొని మాట్లాడారు. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం, ప్రాణ నష్టం జరిగిన సంగతి అందరికీ తెలిసిందేనని, దీనిని కంపెనీ యాజమాన్యాలు, అధికార వర్గాలు ఒక కేస్‌ స్టడీగా తీసుకోవాలని ఆయన సూచించారు