సింగరేణిని బతికించుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • ఆలోచించి మార్గం కనిపెట్టండి అండగా ఉంటాం
  • సింగరేణి కార్మిక సంఘం నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సింగరేణిని బతికించుకోకపోతే భవిష్యత్తు తరాలకు ఏమి ఇవ్వలేం.. సింగరేణిని పది కాలాలపాటు కాపాడుకునేందుకు ఏం చేయాలో కార్మిక సంఘాలు ఆలోచించి మార్గం కనిపెట్టండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సింగరేణి కార్మిక సంఘాలతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. సింగరేణి సంస్థలో పనిచేసే వారు సంస్థ గురించి విధానపారమైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడ తక్కువ ధరకు బొగ్గు లభిస్తే అక్కడ కొనుక్కునే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు అమ్మకం కాకపోతే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అన్ని సంఘాలు సమావేశమై సింగరేణి భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని అమలు చేసేందుకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి సంస్థను బతికించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలు అన్వేషించాలని కార్మిక సంఘాలకు సూచించారు. కార్మిక సంఘాలు అవగాహన లేకుండా హిస్టారికను మాట్లాడితే సంస్థపు నష్టం జరుగుతుంది. మారిన ఆర్థిక పరిస్థితులు, ఓపెన్ మార్కెట్లో బొగ్గు కొనుగోలు చేసే పరిస్థితి పోటీలో నిలబడాలంటే ఏం చేయాలి అనే విషయాలను సింగరేణి అధికారులు కార్మికులకు భోజనం పెట్టి వివరించాలని, ఆఫ్ డే లీవ్ ఇచ్చి మరి విషయాలను వివరించాలని సింగరేణి అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. సమావేశంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక ప్రసాద్, కార్మిక సంఘం నాయకులు ధర్మపురి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.