రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ రఘు బొడ్డుపల్లి ఈ రోజు మొక్కలు నాటారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్‌లో మొక్కలు నాటినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సి బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ వైస్‌ప్రసిడెంట్ కూడా మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ బొడ్డుపల్లి రఘు గారు ఇచ్చిన ఛాలెంజ్ ను తక్షణమే స్వీకరించి వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కూచిభొట్ల ఇన్ఫోసిస్ హైదరాబాద్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.