రాష్ర్టానికి శుక్రవారం 11,930 టన్ను ల యూరియా వచ్చిందని, గత రెండు రోజు ల్లో 23వేల టన్నులు చేరుకుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మరో 4 రోజుల్లో రాష్ర్టానికి 27,650 టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఇక్రిశాట్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం యూరియా సరఫరాపై వ్యవసాయశాఖ సెక్రెటరీ రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రానికి వివిధ ఎరువుల కంపెనీల నుంచి 11 రేకులు రవాణాలో ఉన్నాయని తెలిపారు. వీటిని త్వరగా జిల్లాలకు పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ఇక్రిశాట్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు.
