
ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా స్టేట్ సెంటర్, పవర్ జనరేషన్ కార్పొరేషన్, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, రాష్ట్ర పునరుద్ధ్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్, ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో ‘ప్రభుత్వ పాలసీ, సుస్థిర విద్యుత్తు కోసం సవాళ్లు, అవకాశాలు’ తదితర అంశాలపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్రావు తెలిపారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి టి.అంజయ్యతో కలిసి వివరాలను వెల్లడించారు.
సదస్సుకు ముఖ్యఅతిథిగా విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యుతశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, టీఎస్ఎస్సీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి హాజరవుతున్నారని, 20న ముగింపు సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రణాళికసంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కు మార్, విద్యుత్తు నియంత్రణ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావు, జేఎన్టీయుహెచ్ కళాశాల ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ తులసిరామ్దాస్ పాల్గొంటారని తెలిపారు.