భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా సేవలు అందించిన మామిడి హరికృష్ణను వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల అదనపు రిజిస్ట్రార్‌గా బదిలీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా మామిడి హరికృష్ణ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలకు సంబంధించి పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. గత వారం ఆరోగ్య కారణాలతో ఆయన సెలవుపై వెళ్లడంతో ఆ స్థానంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మిని ప్రభుత్వం ఇన్‌చార్జ్‌గా నియమించింది. అనంతరం మహ బూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా పని చేస్తున్న డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డిని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయే్‌షరంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.