- ఆర్‌ఐ, కంప్యూటర్ ఆపరేటర్ కూడా..
- రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్‌తోపాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మాలోతు భాస్కర్, భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఏసీబీకి పట్టుబడ్డారు. తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన ఓ రైతు మరో రైతు వద్ద కొనుగోలు చేసిన 15 కుంటల భూమిని భూభారతి ద్వారా తనకు రిజిస్ట్రేషన్ చేయాలని రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. వారు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం సదరు రైతు నుంచి లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకున్నారు. తహసీల్దార్, ఆర్‌ఐ, కంప్యూటర్ ఆపరేటర్లను అరెస్టు చేశామని, గురువారం కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు.