జూబ్లీహిల్స్ నివాసంలో భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ( Lindy Cameron) తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. హాజరైన డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్ ( Gareth Wynn Owen), పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి. UK ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ ( Chevening scholarship) కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు అంగీకరించిన లిండీ కామెరాన్. ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వివరించిన బ్రిటిష్ హైకమిషనర్. UK యూనివర్సిటీలలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని కోరిన ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ ను బ్రిటీష్ హైకమిషనర్ కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు ట్రైనింగ్ అందించేందుకు సుముఖత వ్యక్తం చేసిన బ్రిటిష్ హైకమిషనర్. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. Gcc, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకురావాలని కోరిన సీఎం. సానుకూలంగా స్పందించిన బ్రిటీష్ హైకమిషనర్.