తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • రెండు కొత్త పథకాలను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంచనంగా ప్రారంభించారు. “ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన”, “రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం” పేరుతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కు సంబంధించిన పోర్టల్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రెండు పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ “ఈ రెండు పథకాలు మైనారిటీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయి. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయి” అని వెల్లడించారు. “వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుంది” అని తెలిపారు. “ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది” అని అన్నారు. “సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి వెంటనే అమలు చేసే నాయకుడు. ఆయన దూరదృష్టి వల్లే ఈ పథకాలు వెలువడ్డాయి” అని పేర్కొన్నారు.

. “ఈ రెండు పథకాలకే ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించడం మైనారిటీల పట్ల అంకితభావానికి నిదర్శనం” అని తేల్చారు. “నేను మంత్రి గా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి కొత్త పథకాలు ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని” చెప్పారు. “లబ్ధిదారులు ఈ సాయాన్ని కుటుంబాభివృద్ధికి వినియోగించుకోవాలనీ సూచించారు. “మైనారిటీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదు, వారిని స్వయం ఉపాధికి దారి చూపడం మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. “ఈ పథకాలు కుటుంబ పోషణకు తోడ్పడటమే కాకుండా, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయి” అని అన్నారు. “చిన్న వ్యాపారాల ద్వారా సంపాదన పెరిగితే, వారిలోని యువతకు చదువులోనూ, ఉపాధిలోనూ మెరుగైన అవకాశాలు లభిస్తాయి” అని చెప్పారు. “కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎవరూ వెనుకబడకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడమే మా సంకల్పం” అని వెల్లడించారు. “ఈ పథకాలు తాత్కాలిక సహాయం మాత్రమే కాదు, మైనారిటీల దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధికి పునాది” అని అన్నారు. “సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనారిటీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పథకాలను అమలు చేస్తాం” అని హామీ ఇచ్చారు.

✦ లాంచ్ చేసిన పథకాలు ✦
1. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన → వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు ₹50,000 సాయం.
2. రేవంతన్నా కా సహారా – మిస్కీన్‌ల కోసం → ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి ₹1.00 లక్ష గ్రాంట్.
✦ రిజిస్ట్రేషన్ల వివరాలు ✦
ప్రారంభం : 19-09-2025
చివరి తేదీ : 06-10-2025
ఆన్‌లైన్ : TGOBMMS వెబ్‌పోర్టల్ (tgobmms.cgg.gov.in)
ఆఫ్‌లైన్ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, గ్రంథాలయాల చైర్మన్ డా. రియాజ్, కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి, TGMFC వీసీ & ఎం.డి కాంతి వెస్లీ IAS, షఫియుల్లా IFS, AGM కె. పెర్సిస్, రీజినల్ అధికారి ప్రవీణ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.