ఢిల్లీ: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్ పిలిప్ డి.ముర్పీ ఢిల్లీలో శుక్రవారం భేటీ అయ్యారు. విద్యా, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో… పట్టణ రవాణా), మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి… న్యూజెర్సీ గవర్నర్ చర్చించారు. తెలంగాణ విజన్ @2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యాన్ని సీఎం తెలియజేశారు. భేటీలో గవర్నర్ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.