
రాష్ట్రవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ 390వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.