తెలంగాణ రెపరెపలాడాలి, రైజింగ్ కావాలి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

  • రాష్ట్రాన్ని అజేయంగా నిలుపుదాం
  • రాష్ట్రంలో మేధాశక్తి సాటి లేదని ప్రపంచానికి చాటుదాం
  • ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున నియామకాలు జరగలేదు
  • యువత పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం

అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికిని రాష్ట్రాన్ని అజేయంగా నిలబడటానికి, తెలంగాణ రెపరెపలాడటానికి రైజింగ్ రావడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాదులో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం 40 ఏళ్ల పాటు ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నియామకాలు జరిగిన దాఖలాలు లేవని తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 562 మందికి ఏకకాలంలో నియామక పత్రాలు అందజేయడం ఎంతో గర్వకారణం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం నిరుద్యోగ యువత ఉరికంబాలు ఎక్కార ని, అగ్నికి ఆహుతి అయ్యారని, నాడు యువత చేసిన పోరాటం త్యాగాలను చూసి పార్లమెంట్లో బలం లేకున్నప్పటికిని సోనియాగాంధీ అన్ని పార్టీలను కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం పాటు ఈ ఉద్యోగాల కోసమైతే నిరుద్యోగులు పోరాటం చేశారో, ఆ ఉద్యోగాల ప్రస్తావన ఆనాటి పాలకులు తీసుకురాలేదని, గ్రూప్ పరీక్షల నిర్వహణ గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. కేవలం అప్పటి ప్రభుత్వ పెద్దలు వారు వారి కుటుంబ సంక్షేమం కోసమే పాకులాడారు తప్ప నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం కోసం రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన వారి గురించి ఆలోచించకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వారి కుటుంబం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో అనేకసార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన గురించి చర్చించారని, ఎంత ఖర్చైనా వెనకాడకుండా కమిషన్ ప్రక్షాళన చేసి రిక్రూట్మెంట్ కోసం తమ ప్రభుత్వం నిధులను మంజురు చేసిందని తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష నుంచి మొదలుకొని ని యామకాల పత్రాలు అందజేసే వరకు ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేసిందన్నారు. ఈ గ్రూపు వన్ పరీక్షలలో వ్యవసాయ కూలీ బిడ్డ నుంచి మొదలుకొని, పంచర్లు చేసే కుటుంబానికి చెందిన బిడ్డ ఉన్నత అధికారులు గా నియమించబడటం తమను, తమ క్యాబినెట్ ఎంతో ఆనంద భరితానికి గురి చేస్తుందని, గుండె లోతుల్లో నుంచి ఎంతో ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు. దీని కోసమే కదా ఆనాటి యువత ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిందని అన్నారు.రూ. 22,500 కోట్లతో లక్షలాది ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదవారి కలలు నెరవేరుస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ప్రజలను ఆత్మగౌరవంతో నిలబెట్టడమే న నీ అన్నారు. యువత మేధాశక్తిని ఉపయోగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ప్రపంచంతో పోటీపడే స్థాయికి యువతనువా రి మేధ శక్తిని తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రంలోని వనరులను మానవ వనరు లను సానబెట్టి ప్రపంచానికి అందిస్తామన్నారు. విద్యతోనే ఆయా కుటుంబాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి కోట్లాది రూపాయలను విద్యారంగం కోసం ఖర్చు చేస్తుందన్నారు. ఆనాటి పాలకులు అనేక విధాలుగా అవహేళన చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని రాక్షసుల్లాగా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఓ సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.