ఇటీవల అనారోగ్యానికి గురై పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స చేయించుకుని,ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు మరియు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఖర్గే త్వరగా పూర్తిగా కోలుకుని, తిరిగి ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.
