రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌ గుగులోతు కృష్ణ నాయక్‌

  • గతంలోనూ తహసీల్దార్‌ గుగులోతు కృష్ణ నాయక్‌పై అనేక అవినీతి ఆరోపణలు
  • కృష్ణ నాయక్‌ అస్తులపైనా కొనసాగుతున్న ఏసీబీ విచారణ

మ్యుటేషన్‌ నివేదిక ఇచ్చేందుకు ఓ తహసీల్దార్‌ రూ.10 లక్షలు లంచం డిమాండ్‌ చేసి.. మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో గురువారం చోటుచేసుకున్నది. మహబూబ్‌నగర్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ ఇన్‌చార్జి బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 172లోని వ్యవసాయ భూమి మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి నివేదికను చిట్యాల ఎస్సైకి సమర్పించడానికి తహసీల్దార్‌ గుగులోతు కృష్ణ నాయక్‌ ఓ వ్యక్తిని రూ.10 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. గతంలోనూ తహసీల్దార్‌ గుగులోతు కృష్ణ నాయక్‌పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్‌ గుగులోతు కృష్ణ నాయక్‌ అస్తులపైనా ఏసీబీ విచారణ కొనసాగుతున్నది. తహసీల్దార్‌ గుగులోతు కృష్ణ నాయక్‌ ని కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు.