హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ మరియు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలో ఆరోగ్యశాఖ ఆదివారం పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఈ 6 జిల్లాల పరిధిలో 0-5 సంవత్సరాల వయసు పిల్లలు 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో 16,35,432 మంది పిల్లలలు ఆదివారం పోలియో డ్రాప్స్ వేశామని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రకటించారు. మిగిలిన పిల్లలకు కూడా పోలియో డ్రాప్స్ వేయించాలని తల్లిదండ్రులకు సంగీత విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశాఖ సిబ్బంది సోమ, మంగళవారం ఇంటింటికి తిరిగి, ఆదివారం వ్యాక్సిన్ వేయించుకోని పిల్లలకు వ్యాక్సిన్ వేస్తారని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
