బీసీ సంఘాల జేఏసీ చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ కలిసి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ)గా ఏర్పడ్డాయి. బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఐక్యంగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీసీ సంఘాలు, కులసంఘాలు, మేధావులు, ఉద్యోగులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జేఏసీ చైర్మన్‌గా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఉంటారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ 14న తలపెట్టిన బంద్‌ను బీసీ జేఏసీ18వ తేదీకి వాయిదా వేసినట్టు చెప్పారు. బీసీలంతా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.