కొండా లక్ష్మారెడ్డి మృతిపై డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్.ఎస్.ఎస్. వార్తా ఏజెన్సీ వ్య‌వ‌స్థాప‌కుడు కొండా ల‌క్ష్మారెడ్డి ఆక‌స్మిక మృతి ప‌ట్ల ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. శాసన సభ్యుడిగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ల‌క్ష్మారెడ్డి సేవ‌లు అందించార‌ని ఉప ముఖ్యంత్రి అన్నారు. ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అని కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీలో లక్ష్మారెడ్డి పలు హోదాల్లో పని చేశారని ఉప ముఖ్య‌మంత్రి గుర్తు చేసుకున్నారు. ప్ర‌ధానంగా ఆ ధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్ సెల్ అధికార ప్రతినిధిగా సేవ‌లు అందించార‌న్నారు. ల‌క్ష్మారెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు పాత్రికేయ రంగానికి తీర‌ని లోట‌ని భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. ఈ సంద‌ర్భంగా లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ సానుభూతి తెలియజేశారు.