- 148.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన ఘనత ప్రభుత్వానిదే
- రైతాంగం పట్ల అనుసరించిన విధానాలతో అత్యదిక దిగుబడి
- ధాన్యం దిగుబడి లొనే కాదు కొనుగోలులోను రికార్డే
- ధాన్యం కొనుగోలుకూ 23 వేల కోట్లు
- కొనుగోలు ప్రక్రియ నమోదు అయిన 48 గంటలలో చెల్లింపులు
- కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు
- కొనుగోళ్లు సునిశితమైన అంశం అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ధాన్యం దిగుబడిలో తెలంగాణా ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంతటి దిగుబడి రాలేదని ఆయన అన్నారు. వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోటే ఇంతటి ఉత్పత్తి సాధ్యపడిందని ఆయన చెప్పారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పై బుధవారం ఉదయం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయం నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు,వ్యవసాయ శాఖా కార్యదర్శి సురేంద్ర మోహన్, రవాణాశాఖా కమిషనర్ రఘునందన్ రావు,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సునిషితమైన అంశమని,కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎక్కడ కుడా అసౌకర్యం కలుగ కుండా చూడాలని సూచించారు. 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో వ్యవసాయ చరిత్రలోనే రికార్డ్ నమోదు చేసుకోవడమే కాకుండా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం కుడా సరోకోత్త రికార్డ్ అవుతుందని ఆయన చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విదంగా భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు ప్రక్రియ చెపట్టినందున విజయవంతం చేయడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. 22 వేల నుండి 23 వేల కోట్లను వెచ్చించి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.అందులో 40 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు,40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలు కొనుగోలు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 66.8 లక్షల ఎకరాలలో ఉత్పత్తి అయిన ధాన్యం కొనుగోలుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని,అందులో 4,259 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా,3,517 ఐ కే పి కేంద్రాల ద్వారా,ఇతర సంస్థల ద్వారా మరో 566 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంత పెద్ద ఎత్తున దిగుబడి రావడం అంతే పెద్ద ఎత్తున కొనుగోళ్లు చెపడుతున్నందున కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు,పౌర సరఫరాల శాఖాధికారులు సమన్వయం చేసుకొని చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు పూర్తి స్థాయిలో రవాణా వసతి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కొనుగోలు చేసిన ధాన్యం తాలూకు వివరాలు నమోదు అయిన 48 గంటల వ్యవధిలో చెల్లింపులు ఉంటాయన్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ ను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కామారెడ్డి, నిజమాబాద్, మెదక్,సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో 1205 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరిక్షంచకుండా చర్యలు చేపట్టడంతో పాటు కొనుగోలుకు సంబంధించిన అన్ని పరికరాలు అమర్చు కోవాలని ఆయన ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టాక గడిచిన ఎండాకాలం ధాన్యం కొనుగోలులో అధికారులు సమన్వయంతో పని చేసినందునే అద్భుతమైన ఫలితాలు సాదించమన్నారు. గత అనుభవలను పరిగణనలోకి తీసుకుని వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అత్యవసరం అనిపిస్తే అదనపు ఖర్చులకు వెనుకడుగు వేయకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుండి 72 గంటల వ్యవధిలో రైతులకు నగదు చెల్లింపులకు వీలుగా తూకం నుండి డేటా ఎంట్రీ వరకు సమయపాలన పాటించాలన్నారు. వాతావరణం మార్పులు,వర్ష సూచనలను పౌర సరఫరాల అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.వర్షం వస్తే ధాన్యం చెడిపోకుండా ఉండేందుకు గాను టార్బలిన్ లను ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తనతో పాటు పౌర సరఫరాల శాఖా కమిషనర్ ను సంప్రదించాలన్నారు.24 గంటలు తాను అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/1967 హెల్ఫ్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసే వరకు జిల్లా కేంద్రం నుండి కొనుగోలు కేంద్రాల వరకు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన రెండేళ్లుగా ఎన్నో సవాళ్ళను ఎదురు కుంటేనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేశామన్నారు. ప్రస్తుత వానాకాలంలో ముందెన్నడూ లేని రీతిలో ధాన్యం దిగుబడి వచ్చిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ,వ్యవసాయ, సహకార శాఖలు సమన్వయం చేసుకొని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక దృష్టితో సారించాలన్నారు.
