హ్యామ్ విధానంలో పెద్దఎత్తున రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుపై గురువారం క్యాబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆ శాఖ అధికారులతో ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలోఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత హ్యామ్ రోడ్లు, టిమ్స్ దవాఖానల నిర్మాణ పురోగతిపై చర్చించారు. వచ్చే 30నెలల్లో దేశంలోనే ‘ది బెస్ట్ రోడ్స్ ఇన్ తెలంగాణ’ అనేవిధంగా చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. హ్యామ్ విధానంలో దశలవారీగా రోడ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. అలాగే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందే టిమ్స్ దవాఖానల పనుల్లో వేగంపెంచి, అతి త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్సీలు మోహన్‌నాయక్, జయభారతి, సీఈలు రాజేశ్వర్‌రెడ్డి, బీబీరావు, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
