తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన శృంగేరి పీఠాధిపతులు, జగద్గురు విధుశేఖర భారతికి నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన విధు శేఖర భారతిని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక నుండి తెలంగాణ రాష్ట్రంలో చేరుకున్న విదుశేఖర భారతికి నారాయణపేట జిల్లాలో ఎండోమెంట్స్ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం, శంషాబాద్ ఆశ్రమానికి చేరుకున్న శృంగేరి స్వామికి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఎండోమెంట్స్ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు లతోపాటు ఎండోమెంట్స్ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు..