రేప‌టి బంద్‌ను శాంతియుతంగా జ‌రుపుకోవాలి : డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

 రేప‌టి బంద్‌ను శాంతియుతంగా జ‌రుపుకోవాల‌ని రాష్ట్ర డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌కు, చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తాయ‌ని పేర్కొన్నారు. బంద్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల‌న్నారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌కుండా, బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి సూచించారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల కోసం రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఈ నెల 18న బంద్‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం చేప‌ట్ట‌బోయే బంద్‌ ఫర్‌ జస్టిస్‌కు ఆయా రాజ‌కీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్ర‌క‌టించాయి. ఈ బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని బీసీ సంఘాల జేఏసీ ప్ర‌జ‌ల‌ను కోరింది.