టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో ఉత్తీర్ణులై, ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శనివారం నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్, శిల్పకళావేదికలో శనివారం జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. కాగా, ఈ నియామకాల్లో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖలో 14 మంది సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు ఎంపికయ్యారు. వీరిలో నలుగురిని చార్మినార్ (హైదరాబాద్) జోన్‌కు, నలుగురిని బాసర జోన్‌కు, కాళేశ్వరం, భద్రాద్రి జోన్లకు ముగ్గురేసి చొప్పున కేటాయించారు. వీరికి ఏడాది శిక్షణ అనంతరం పోస్టింగులు ఇస్తారు. కాగా, దాదాపు పదేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖకు కొత్త సబ్ రిజిస్ట్రార్లు వస్తుండడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.