శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజు 281 జయంతి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణములో టౌన్ హాల్ నందు ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజు 281 జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.
ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాలాల్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి.
హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలపై నమ్మకంతో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పంపించడం జరిగింది ఆ నమ్మకాన్ని హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు నిలబెట్టడంతో..గెలిచిన మూడో రోజే కృతజ్ఞత సభ పెట్టడం, సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ కి రావడం జరిగింది. అంతే కాకుండా సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మెళ్లచెరువులో మంజూరీ చేయడం జరిగింది మరియు బంజారాభవన్ కి కోటిన్నర మంజూరు చేయించడం జరిగిందన్నారు.
యువత ముందుకు రావాలి… యువత పెడదోవ పట్టకుండా.. మంచి అలవాట్లను అలవాటు చేసుకోవాలి. మన తండాని మనమే బాగు చేసుకోవాలి అన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. లంబాడి భాషలో మాట్లాడి గిరిజనులను ఆకట్టుకున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.