కర్నూలు జిల్లా చిన్నటేకూరులో బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించిన జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్,IAS., మరియు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, ఐపీఎస్. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద చోటుచేసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్, IAS, గారు మరియు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు., ఐపీఎస్., స్వయంగా సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించరు. ప్రమాదంపై సంబంధిత అధికారులతో చర్చించి, సహాయక చర్యలను వేగవంతం చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించేందుకు కర్నూలు జిల్లా యంత్రాంగం తో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా యంత్రాంగం కూడా కృషి చేస్తోంది. బస్సు ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రింది అధికారులతో హెల్ప్‌లైన్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేసింది.
శ్రీ రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ: 9912919545
చిట్టిబాబు సెక్షన్ ఆఫీసర్:9440854433
ఈ నేపథ్యంలో జోగుళాంబ గద్వాల్ జిల్లా, కలెక్టర్ కార్యాలయంలో, పోలీసు కంట్రోల్ రూమ్ నందు ఏర్పాటు చేయడమైనది. సమాచార కోసం బాధిత కుటుంబాలు క్రింది నంబర్‌కు సంప్రదించవచ్చు.
గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828
గద్వాల్ కలెక్టరేట్ లోని కంట్రోల్ నం 9502271122
కలెక్టరేట్ లోని హెల్ప్ డెస్క్ నం. 9100901599, 9100901598
కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం.9100901604