శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీకి ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు. మంగళవారం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు కాంచీపురం నుండి కర్నూలు, జడ్చర్ల మీదుగా హైదరాబాద్ లో దేవాలయంలో జరిగే కుంభాభిషేక కార్యక్రమానికి వెళ్తుండగా వారికి తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రవేశం ద్వారం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ అర్చకులు, శ్రీ జమ్ములమ్మ దేవాలయ ఈవో పురందర కుమార్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో స్వామీజీకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.