మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 256 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 71, రెవెన్యూ శాఖకు సంబంధించి 37, ఇందిరమ్మ ఇండ్ల కోసం 83, ప్రవాసి ప్రజావాణికి 01 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 64 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.