అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించగలిగాము: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

  • వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తుఫాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు SDRF (STATE DISASTER RELEEF FUND), PR 27 నిధులు వాడుకొని, తదుపరి 30 రోజుల్లో RATIFY చేసుకోవాలని, నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ 48 గంటలు ముందుగా అందరినీ అలర్ట్ చేయడం, ప్రభుత్వ యంత్రాంగం అందుకు అనుగుణంగా స్పందించడంతో ప్రాణ నష్టాన్ని, భారీ ఆస్తి నష్టం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామని డిప్యూటీ సీఎం అన్నారు. రాబోయే 24 గంటలు కలెక్టర్లు ఇతర అధికారులు సైక్లోన్, MANUVAL దగ్గర పెట్టుకొని సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం వివరించారు. తుఫాను ప్రభావం దురదృష్టకరం, కృష్ణాజిల్లా నుంచి నల్లగొండ, ఖమ్మం జిల్లా మీదుగా వెళ్లడంతో ఉత్తర తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారులు అప్రమత్తమై పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పడం, గోదాముల్లోకి పత్తి పంటను షిఫ్ట్ చేయడంతో పత్తి పంటను కాపాడుకోగలిగం అన్నారు. తుఫాను నేపథ్యంలో ఉత్తర, దక్షిణ సీఎండీలు మొదలుకొని విద్యుత్ శాఖ యావత్తు తుఫాను సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి అని డిప్యూటీ సీఎం తెలిపారు. భారీ తుఫాను వచ్చినప్పటికీ ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తకుండా మొబైల్ వ్యాన్లు పెట్టుకొని సిబ్బంది ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు వెళ్లారని డిప్యూటీ సీఎం వివరించారు.
తుఫాను నేపథ్యంలో రెండు డిస్కౌంట్ పరిధిలో 11. 33/11 కె.వి సబ్ స్టేషన్లు దెబ్బతినగా ఏడు సబ్ స్టేషన్ లను తిరిగి పునరుద్ధరించారు కొద్దిగంటల్లో మిగిలిన నాలుగు సబ్ స్టేషన్లను పునరుద్ధరిస్తారని వివరించారు. 101. 33 కెవి లైన్లు దెబ్బతినగా అందులో 96 లైన్లను ఇప్పటికే పునరుద్ధరించారు ఈరోజు మిగిలిన 5 లైన్లను పునరుద్ధరిస్తారని వివరించారు. 11 కెవి లైన్లు 237 డామేజ్ కాగా ఇప్పటికే 227 లైన్లను పునరుద్ధరించారని వివరించారు. DTR(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్) లు 171 దెబ్బతినగా 49 ప్రాంతాల్లో పునరుద్ధరించారు మరో 122 ట్రాన్స్ఫార్మర్లను కొద్ది గంటల్లో పునరుద్ధరిస్తారని డిప్యూటీ సీఎం వివరించారు. 638 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా 304 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు మరో 334 కొద్ది గంటల్లో పునరుద్ధరిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.