న్యాక్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

  • శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ తో పాటు ఉద్యోగావకాశాలు
  • అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో, వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయనీ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి,NAC వైస్ చైర్మన్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో సివిల్ సూపర్వైజర్ మరియు ఎలక్ట్రిషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయనీ, శిక్షణతో పాటు ఉచిత భోజనం,నివాసం మరియు వసతి సదుపాయాలు కల్పించబడతాయన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ తో పాటు ఉద్యోగావకాశాలు అందించబడుతాయని,ఈ శిక్షణ కార్యక్రమం 03.11.2025 నుండి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC), హైదరాబాద్ లో ప్రారంభమవుతుందనీ మంత్రి తెలిపారు. శిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్లు: 8008937800 / 9032504507