రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన 1991 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి హార్పిథ్సింగ్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్యలయం లో బతుకమ్మ కుంట దగ్గర మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి నామినేట్ చేశారు ఈ సందర్భంగా హర్పిథ్ సింగ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం దానివల్ల మనకు నీడ వస్తుంది, మంచి ఆక్సిజన్ వస్తుంది, పక్షులు కూడా బ్రతుకుతాయి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అని అన్నారు. ఇంతటి మంచి కార్యమాన్ని తన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న 172 ఐఏఎస్ , ఐఎఫ్ఎస్, ఎంఈసి వాళ్లకు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ యొక్క ప్రాధాన్యత వారి ద్వారా ఇతరులకు తెలియజేస్తాం అన్నారు మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు.