సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద రావు పదవీ విరమణ

సమాచార పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న జి ప్రసాదరావు నేడు పదవీ విరమణ చేశారు వివిధ హోదాల్లో దాదాపు 41 సంవత్సరాల సర్వీసు అనంతరం నేడు ప్రసాదరావు పదవి విరమణ కార్యక్రమాన్ని సమాచార భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ హైదరాబాద్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేసిన ప్రసాదా రావు సేవలను ఈ పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన సీనియర్ అధికారులు కొనియాడారు. ఈ పదవి విరమణ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్లు డీ.ఎస్ జగన్, డి శ్రీనివాస్, కే వెంకటరమణ డిప్యూటీ డైరెక్టర్లు హాష్మి,, వై వెంకటేశ్వర్లు సురేష్, ఆర్.ఐ.ఈ జయరాం మూర్తి, తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ శాస్త్రి లతోపాటు సమాచార శాఖ అధికారులు, సిబ్బంది, డిడి ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,