మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్‌ నేత అజారుద్దీన్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్లో అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లా సాక్షిగా ప్రమాణం చేసిన ఆయన జై తెలంగాణ, జైహింద్‌ అంటూ నినదించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు, ఇతర నేతలు అజారుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పలువురు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.