కార్పోరేషన్ ల పని విధానం పరిమితులపై కసరత్తు వేగవంతం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • నిరర్ధకంగా మారిన కార్పోరేషన్ ల పునరుద్ధరణపై కార్యాచరణ
  • వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పోరేషన్స్ పై మంత్రి తుమ్మల సమీక్ష
  • ర్పోరేషన్ ల ఆర్ధిక పరిస్థితి అప్పులు –ఆస్తులు పై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ కార్పోరేషన్స్ స్థితిగతులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష చేశారు.శనివారం నాడు సచివాలయం లో వ్యవసాయ శాఖ పరిధిలోని అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కార్పోరేషన్ ల పనితీరుపై చర్చించారు. వ్యవసాయశాఖ కు అనుబంధముగా ఉన్న చాలా కార్పోరేషన్లు , అవి ఏర్పడినప్పుడు ఉన్న పరిస్థితులు, వాటి ఉద్దేశ్యాలు, వాటికి గల ఆర్థిక మానవ వనరులు , రైతులకు కార్పొరేషన్ల ద్వారా ఒన గురే ప్రయోజనాలతో పోల్చుకుంటే, కాలక్రమేణా జరిగిన మార్పులతోనో లేక పరిపాలన సౌలభ్యమైన కారణాలతో, కొన్ని కార్పొరేషన్ల పై పని ఒత్తిడి భారం పెరిగగా, మరికొన్ని కార్పొరేషన్ లు పూర్తిగా నిరర్థకం కావడం గమనించవచ్చు. చివరికి అందులో పని చేస్తున్న ఉద్యోగస్థుల జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితులలో కార్పొరేషన్ లు చేరుకున్నాయి. అంతేగాక ఒక్కటే పనిని, 3,4 కార్పొరేషనల నిర్వహించడం, (ఉదాహరణకు ఎరువుల, విత్తనల సరఫరా) కార్పొరేషన్ లకు సంబంధము లేని కొన్ని కార్యకలాపాలలో అవి పాలు పంచుకోవడం వంటి వాటితో కొత్త సమస్యలు రావడం జరిగింది. ఇవి అన్నీ గమనించిన మంత్రి వర్యులు మొదటి సంవత్సరం నుండే వాటిని గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు జరిగిన సమీక్షలో వాటి పని విధానం ఎలా సాగుతుంది వారి పరిధి దాటి ఇతర పనులు చూస్తున్నారా, పనిభారం విధి విధానాల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ ల ఆర్ధిక పరిస్థితులు రుణాలు – ఆస్తులు పై పూర్తి స్థాయిలో వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లు రైతాంగానికి సేవలు అందించేలా సమర్ధవంతంగా పని చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.గత కొంత కాలంగా నిరర్ధకంగా మారిన అగ్రోస్ ను మళ్లీ పునరుద్ధరణ చేయాలని అందుకు తగ్గ కార్యాచరణ సిద్ధం చేయాలనీ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పోరేషన్స్ అన్ని సమర్ధవంతంగా పని చేసేలా పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ డైరక్టర్ గోపి IAS గారు, ఆయిల్ ఫెడ్ ఎం.డీ శ్రీమతి యాస్మిన్ బాషా IAS గారు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ భాయి గారు, ఆగ్రోస్ ఎండీ శ్రీ రాములు గారు,ఇతర అధికారులు పాల్గొన్నారు.