- పత్తి తేమ శాతం విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి
- ఆగ్రోస్ కార్యాలయం క్షేత్ర స్థాయి పర్యటనలో మంత్రి తుమ్మల వెల్లడి
- నిరర్ధకంగా మారిన ఆగ్రోస్ ను పునరుద్ధరణ చేస్తాం
వ్యవసాయ శాఖ పరిధిలో గల అన్ని కార్పొరేషన్ లు సమర్థవంతంగా పనివేసేలా ప్రభుత్వం కార్యచరణతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.శనివారం ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రైతాంగానికి సేవలు అందించిన ఆగ్రోస్ నిరర్ధకంగా మారిందని దాన్ని పునరుద్ధరణ చేసి మళ్ళీ రైతాంగానికి సేవలు అందించేలా ,తగిన కార్యాచరణ కోసం క్షేత్ర స్థాయిలో పర్యటన చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.
మొoథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల కష్టాలు చూసారు.ప్రతి ఎకరాకు పది వేల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. పత్తి రైతులు తేమ శాతం విషయంలో అప్రమత్తంగా ఉండాలని మద్దతు ధర దక్కాలంటే జాగ్రత్తగా పత్తి ఆరబెట్టుకోవాలని మంత్రి తుమ్మల రైతాంగానికి సూచించారు.