బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కతన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.