రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందడం పట్ల రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు క్యాబినెట్ సహచరులు వెంటనే స్పందించి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.