
శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతన్నాయి. ఓం నమఃశివాయ నామ స్వరణతో భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వరస్వామి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శివాలయాలను దర్శించుకుంటున్నారు. రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.