ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC)ని ఇవాళ హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించిన జర్మనీ బృందం. GCC ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం. హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ GCC ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు సీఎం కు వివరించిన జర్మనీ బృందం. హైదరాబాద్ లో ఇన్నోవేషన్ హబ్ గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్ ను కోరిన ముఖ్యమంత్రి. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందన్న సీఎం. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినారు.వీటితో TOMCOM ద్వారా పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని కోరిన సీఎం. ఈ భేటీలో శ్రీమతి అమిత దేశాయ్, డ్యుయిష్ బోర్స్ CIO/COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.