వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో 04.11.2025న భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిచిన ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీ భాయి సూచనలతో రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. విచారణలో 7329 బస్తాల పత్తిలో 59 బస్తాలు మాత్రమే తడిసినట్లు తేలింది. తడిసిన పత్తిని సిబ్బంది సహాయంతో ఆరబెట్టి అదే రోజున కొనుగోలు చేశారు. విచారణ నివేదిక ప్రకారం రైతులకు ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ నివేదికను మంత్రి గారికి సమర్పించిన మార్కెటింగ్ డైరెక్టర్