తెలంగాణలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు

  • ఏకకాలంలో రంగంలోకి దిగి ఏసీబీ అధికారుల సోదాలు
  • డాక్యుమెంట్ రైటర్లను విచారించిన ఏసీబీ అధికారులు
  • ముసాపేట, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై, ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. నగర కేంద్రంగా నెలకొన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో, ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రోజు ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే, మూసాపేట్, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో డాక్యుమెంట్స్ రైటర్స్ లేనిదే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగట్లదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనీఖీలు నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన కంపైంట్ లకు బలం చేకూరే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనీఖీ లు చేసే సమయంలో 15మందికి పైగా డాక్యుమెంట్ రైటర్స్ ఆఫీస్ లోనే స్లాట్ బుకింగ్ కన్నా పదుల లంఖ్యలో ఎక్కువ డాక్యుమెంట్స్ తో ఉండడంపై అధికారు లు దృష్టి పెట్టారు. ఒక డాక్యుమెంట్ రైటర్ వద్ద దొరికిన 10వేల రుపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యు మెంట్ రైటర్స్ ఉండడంపై జిల్లా ఉన్నతా ధికారులకు పిర్యాదు చేస్తామన్నారు.

డాక్యుమెంట్ రైటర్ లా పై వచ్చిన ఫిర్యాదుల మేరకు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో లంచాలు ఎక్కువగా డిమాండ్ చేస్తూ తీసుకొంటున్నారని, పనులలో జాప్యం చేస్తున్నారని ఆరోపణలతో ఏ.సి.బి డి.యస్.పి శ్రీనివాస్ రెడ్డి ఆద్వర్యంలో గురువారం ఆకస్మిక తనిఖీలు చేసారు. అధికారుల బృందం కార్యాలయంలోకి రావడంతోనే డాక్యుమెంటరీ రైటర్లు ఎక్కవగా ఉండంటంతో అందరిని విచారించారు. ఒక సాక్షివద్ద 10,000 పది వేల రూపాయలు దొరకడంతో అతని లావాదేవీలు విచారిసు న్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి నగదు దొరకలేదని రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు.