మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్‌

మైనార్టీ, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖ మంత్రిగా మహమ్మద్‌ అజారుద్దీన్‌ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న అజారుద్దీన్‌.. ప్రార్థనల మధ్య ఆయన తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. అజారుద్దీన్‌కు మంత్రులు భట్టి, ఉత్తమ్‌, పొన్నం, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు కలిసి అభినందనలు తెలిపారు.