సాహితీ లోకానికి గర్వకారణమైన అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం అందెశ్రీ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.