- టెక్నో–కల్చరల్ ఫెస్టివల్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- 55 లక్షల రూ. నిధులు మంజూరు
- హైదరాబాద్ వేదికగా ‘కల్చరల్ సావరినిటీ త్రూ సినిమా’ ఉత్సవం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ–నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్, టెక్నో–కల్చరల్ ఫెస్టివల్ – కల్చరల్ సావరినిటీ త్రూ సినిమా” అనే విభిన్న సాంస్కృతిక–సినిమాటోగ్రఫీ ఉత్సవం నిర్వహణకు రూ. 55 లక్షల నిధులను మంజూరు చేసిందనీ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జి.ఓ.ఆర్.టి.నెం.1551 ప్రకారం, ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) ఆధ్వర్యంలో ఈ నెలలో హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ మరియు హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సినీ–సాంస్కృతిక రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే దిశగా ముందడుగు వేస్తోంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణను దేశంలోని కళ, సంస్కృతి, సినిమాటోగ్రఫీ రంగాల కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ ఫెస్టివల్ ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో సాంస్కృతిక, సృజనాత్మక బంధాలు మరింత బలపడతాయి,” అన్నారు. ఈ ఫెస్టివల్లో జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాల ప్రదర్శనలు, ప్యానెల్ చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం కల్చరల్ ఎక్స్చేంజ్కి కేంద్ర బిందువుగా ఎదుగుతున్నదని తెలిపారు.