
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రాక్టికల్ పరీక్షలు గురువారంతో ముగియగా.. మార్చి 4 నుంచి 20 వరకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగనుండగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 37,539 మంది హాజరు కానున్నారు. వీరికోసం జిల్లా వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయానికంటే నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ప్రతి పరీక్ష కేంద్రంపై జీపీఎస్‌తో నిఘా ఏర్పాటు చేయనుండగా.. సీసీ కెమెరాల ఎదుటనే ప్రశ్న పత్రాలను పోలీసుల సమక్షంలో తెరవాల్సి ఉంటుంది. మరో వైపు పరీక్ష కేంద్రాల తనిఖీకి సీనియర్ అధ్యాపకులతో ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్యాడ్ బృందాలను ఇంటర్ విద్యా శాఖ నియమించింది.